హాలీవుడ్ డైరెక్టర్ పాల్ హగ్గిస్ పేరు ఫిలిమ్ బఫ్స్ కు సుపరిచితమే! ఆయన రచనతో తెరకెక్కిన ‘మిలియన్ డాలర్ బేబీ’, ‘క్రాష్’ చిత్రాలు ఆస్కార్ ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి. ‘క్రాష్’ ద్వారా ఆయనకు నిర్మాతగా, రచయితగా కూడా ఆస్కార్ అవార్డులు లభించాయి. 69 ఏళ్ళ హగ్గిస్ ను ఇప్పటికీ కొందరు రొమాంటిక్ అంటూ కీర్తిస్తుంటారు. అందులో నిజానిజాలు ఏమో కానీ, ఓ రేప్ కేసులో హగ్గిస్ ను ఇటలీ పోలీసులు ఆదివారం (జూన్ 19న) అదుపులోకి తీసుకున్నారు.…