బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం నటించిన పేట్రియాటిక్ మూవీస్ కు కొదవలేదు. మరీ ముఖ్యంగా ‘పరమాణు’, ‘సత్యమేవ జయతే’ చిత్రాలతో జాతీయ వాదుల మనసుల్ని ఈ యాక్షన్ హీరో బాగానే దోచుకున్నాడు. మరోసారి వారందరి మెప్పు పొందేందుకు జాన్ అబ్రహమ్ చేసిన ప్రయత్నమే ‘ఎటాక్ -1’. ఇండియాస్ ఫస్ట్ సూపర్ సోల్జర్ మూవీగా చెప్పబడుతున్న ఈ సినిమా ఏప్రిల్ 1న జనం ముందుకు వచ్చింది. సోల్జర్ అయిన అర్జున్ షేర్గిల్ టెర్రరిస్ట్ అటాక్ లో తీవ్రంగా గాయాలపాలవుతాడు.…