భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో చిరుతపులిలా పరుగెత్తడం చూస్తూ ఉంటాం. ఫీల్డింగ్ అయినా, వికెట్ల మధ్య అయినా వేగంగా పరుగులు తీస్తాడు. అయితే ఈరోజు చివరి టెస్టులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ జోరుకు బ్రేక్ పడినట్లుగా అనిపించింది. ఎందుకంటే.. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే కోహ్లీ.. రనౌట్ అయ్యాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో డైవింగ్ చేసినా వికెట్ కాపాడుకోలేకపోయాడు.