Dinga Dinga: ఆఫ్రికా దేశం ఉగండాను ఓ వింత వ్యాధి వణికిస్తోంది. ‘‘డింగా డింగా’’ అని పిలిచే ఈ వ్యాధి అక్కడి స్థానికుల్లో కలకలం రేపింది. బుండిబుగ్యో జిల్లాలో దాదాపుగా 300 మంది ప్రజలు ఈ వ్యాధినపడ్డారు. ముఖ్యంగా స్త్రీలు, బాలికలను ఈ వ్యాధి ప్రభావితం చేస్తోంది. జర్వంతో పాటు శరీరం విపరీతంగా వణకడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.