Israel Earthquake: ఇజ్రాయెల్‌లోని దక్షిణ నెగెవ్ ఎడారిలో గురువారం ఉదయం 9 గంటలకు 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కేంద్రం డిమోనా నగరానికి సమీపంలో ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్‌లోని అత్యంత రహస్య అణు పరిశోధన కేంద్రం (షిమోన్ పెరెస్ నెగెవ్ అణు పరిశోధన కేంద్రం) ఉంది. ఒక్కసారిగా వచ్చిన భూకంపంతో ఆ ప్రాంతంలో ఉండే వాళ్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇదే టైంలో సోషల్ మీడియాలో అణు పరీక్ష పుకార్లు వ్యాపించాయి.…