ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోశాంజ్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆయన లైవ్ షోలు, వాటికి సంబంధించి జరుగుతున్న వివాదాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నవంబర్ 15న హైదరాబాద్‌లో దిల్జిత్ కాన్సర్ట్ జరగనుంది. ఈ మేరకు ఈవెంట్ నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు పంపింది. నోటీసుల ప్రకారం పిల్లలను వేదికపైకి తీసుకెళ్లకూడదని కోరారు. WHO మార్గదర్శకాల ప్రకారం లైవ్ షో సమయంలో లౌడ్ మ్యూజిక్ ఉంటుంది, ఫ్లాష్ లైట్లు ఉంటాయి కాబట్టి వారిని స్టేజ్ ఎక్కించవద్దని…