మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శివసేనతో పాటు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలో కాకపుట్టిస్తోంది. శివసేన కీలక నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే 35 మంది శివసేన ఎమ్మెల్యేలతో పాటు ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో అస్సాం రాజధాని గౌహతిలో క్యాంప్ ఏర్పాటు చేయడంతో రాజకీయ సంక్షోభం మొదలైంది. తన వర్గం ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు షిండే. శివసేన, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు…