చిత్రసీమ చిత్రవిచిత్రమైనది. కొన్నిసార్లు అసలు పేర్లు మార్చేస్తుంది. కొసరు పేర్లు అతికిస్తుంది. ఇంటిపేర్లనూ కొత్తవి చేస్తుంది. తమకు పేరు సంపాదించిన చిత్రాలనే ఇంటిపేర్లుగా మార్చుకొని సాగిన వారెందరో ఉన్నారు. అలాంటి వారిలో నేడు నిర్మాతగా, పంపిణీదారునిగా చక్రం తిప్పుతోన్న’దిల్’రాజు అందరికీ బాగా గుర్తుంటారు. రాజు అసలు పేరు వెలమకుచ వెంకటరమణారెడ్డి. ఆ పేరు చిత్రసీమలో ఎవరికీ అంతగా తెలియదు. అంతకు ముందు పంపిణీదారునిగా, అనువాద చిత్ర నిర్మాతగా ఉన్న రాజు, ‘దిల్’ సినిమా విజయంతో ‘దిల్’రాజుగా మారిపోయారు.…