నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేయాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా ముడిమ్యాల నుంచి చేవెళ్లలోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు 10 కిలోమీటర్లమేర పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పాదయాత్ర అనంతరం భహిరంగ సభలో రేవంత్ రెడ్డి, దిగ్విజయ్ సింగ్ తదితరులు ప్రసంగిస్తారు. Read: ప్రపంచాన్ని చుట్టేస్తున్న…
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు సమయం దొరికినప్పుడల్లా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపైనా, ఆర్ఎస్ఎస్ పైనా నిప్పులు చెరుగుతుంటారు. వారి మతరాజకీయాలపై విమర్శలు చేస్తుంటారు. అయితే, సడెన్‌గా దిగ్విజయ్ సింగ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపైనా, ఆర్ఎస్ఎస్‌పైనా ప్రశంసలు కురిపించారు. గతంలో వారు చేసిన సాయం గురించి మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాలుగేళ్ల క్రితం తాము నర్మదా పరిక్రమ యాత్రను చేస్తున్న సమయంలో అమిత్ షా, ఆర్ఎస్ఎస్‌లు గొప్ప సాయం చేశారని…