Cyber Fraud: సాంకేతిక ప్రగతికి అనుగుణంగా సైబర్ నేరాలు కూడా రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో దాడి చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, అధిక లాభాల పేరుతో ఫేక్ లింకులు పంపుతూ ఫోన్ క్లిక్‌తోనే ఖాతాల్ని ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఆఫర్ల పేరుతో వచ్చే లింకులను బదులిచ్చే ముందు ఒక్కసారైనా ఆలోచించాలని…