Digital Arrest Scam: ఏకంగా ఎమ్మెల్యేనే ముంచేశారు కదరా.. రూ.31 లక్షలు స్వాహా చేసిన స్కామర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digital Arrest Scam: ఈ మధ్య తరుచు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎందరినో స్కామర్లు దోచుకుంటున్న విషయాలు చూస్తూనే ఉన్నాము. ఇలా స్కాంలో తాజాగా చిక్కుకున్న కర్ణాటక మాజీ ఎమ్మెల్యే గుండప్ప వకిల్ ఎనిమిది రోజుల్లో దాదాపు రూ. 31 లక్షలు పోగొట్టుకున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP), ఒక న్యాయమూర్తిగా నటిస్తూ మోసగాళ్లు ఈ కుట్రకు పాల్పడ్డారు.
అసలేమైందన్న విషయానికి వస్తే.. ఆగస్టు 12 సాయంత్రం ఒక నకిలీ సీబీఐ అధికారి గుండప్ప వకిల్‌కు ఫోన్ చేసి.. వ్యాపారవేత్త నరేష్ గోయల్ సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆయన పేరు కూడా ఉందని చెప్పారు. సీబీఐ అధికారులు జప్తు చేసిన వాటిలో గుండప్ప పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా, ఏటీఎం కార్డు ఉన్నాయని, ఇవి నిధుల దుర్వినియోగానికి సంబంధించినవని ఆ మోసగాడు తెలిపాడు. ఆ తర్వాత, నకిలీ సీబీఐ అధికారి బాధితుడి వ్యక్తిగత వివరాలు, ఆస్తుల వివరాలు అడిగి తీసుకున్నాడు.
Also Read
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
YS Jagan Mohan Reddy: మెడికల్ కాలేజీలను చంద్రబాబు పప్పుబెల్లాలకు అమ్ముకుంటున్నారు..
ఆ తర్వాత, ఆ కాల్‌ను నీరజ్ కుమార్ అనే వ్యక్తికి బదిలీ చేశారు. అతను తనను తాను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పరిచయం చేసుకుని, గుండప్ప వకిల్‌ను ‘డిజిటల్ అరెస్ట్’ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ కాల్ కట్ చేయకూడదని బాధితుడికి గట్టిగా సూచించాడు. ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో, మోసగాళ్లు బాధితుడిని వీడియో కాల్ ద్వారా ‘న్యాయమూర్తి’ ముందు హాజరుపరిచారు. తాను ఎలాంటి మోసాలకు పాల్పడలేదని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని ఆ ‘న్యాయమూర్తి’ గుండప్పను ఆదేశించాడు. అంతేకాకుండా, RTGS ద్వారా రూ. 10.99 లక్షలను ఒక బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించాడు.
ఆ తర్వాత నీరజ్ కుమార్, మరో అధికారి సందీప్ కుమార్ అనే వ్యక్తులు ప్రతిరోజూ గుండప్ప వకిల్‌ను ఫోన్ చేస్తూ, దర్యాప్తు పేరుతో ఆయనను.. వారితోపాటు ఆయన కుటుంబ సభ్యుల బ్యాంక్ వివరాలను సేకరించారు. కొద్ది రోజుల తర్వాత, ఎమ్మెల్యేను మరోసారి వీడియో కాల్ ద్వారా ‘న్యాయమూర్తి’ ముందు హాజరుపరిచారు. ఈసారి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సీబీఐ దర్యాప్తు కోసం రూ. 20 లక్షలు బదిలీ చేయాలని ఆదేశించారు. డబ్బు బదిలీ చేస్తే, విచారణ పూర్తయ్యాక తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు ఆ డబ్బును కూడా బదిలీ చేశాడు.
చివరకు డబ్బు తిరిగి రాకపోవడం, మోసగాళ్ల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో 73 ఏళ్ల గుండప్ప వకిల్ తాను ‘డిజిటల్ అరెస్ట్’ కు బలైపోయానని గ్రహించారు. సెప్టెంబర్ 6న, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఈ విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?