భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌లు ముందున్నాయి. అయితే డిజిటల్ ఎగుమతుల విషయంలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఈ జాబితాలో భారత్ కంటే అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ మాత్రమే ముందున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకారం.. భారతదేశం 2023లో 257 బిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ వస్తువులను ఎగుమతి చేస్తుంది. భారతదేశ డిజిటల్ ఎగుమతులు 2022 సంవత్సరంలో 17 శాతం పెరిగాయి.