టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా కేసీఆర్, కేటీఆర్‌లను టార్గెట్ చేస్తూ.. ట్విట్టస్త్రాలు సంధించారు. వరంగల్ రింగు రోడ్డు (డబ్ల్యూఆర్ఆర్) పేరిట టీఆర్ఎస్ మరో లూటీకి తెర తీసిందంటూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్లర్‌లో ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు వరంగల్ రింగు రోడ్డు పేరిట వరంగల్ పరిధిలోని సారవంతమైన భూములను రైతుల నుంచి లాక్కునేందుకు ఇప్పటికే తమ రియల్ ఎస్టేట్ మాఫియాను రంగంలోకి దించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇందులో…