కేంద్ర ప్రభుత్వం వరుసగా రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో లీటర్ పెట్రోలుపై రూ.9.50, లీటర్ డీజిల్‌పై రూ.7 మేర తగ్గనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ రూ.119.49, డీజిల్ రూ.105.49గా ఉండగా.. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ.120, లీటర్ డీజిల్ రూ.105.65గా ఉన్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర రూ.110కి దిగివచ్చే అవకాశముంది. అటు లీటర్ డీజిల్ ధర రూ.100…
కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరల్లో మార్పు చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చాలా రోజుల తర్వాత మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు, లీటర్ డీజిల్‌పై 16 పైసలు పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.66కి చేరింది. అటు లీటర్ డీజిల్ రూ.105.65కి ఎగబాకింది. New Rule: అలర్ట్.. పాన్ కార్డు వాడే వారికి కొత్త రూల్ అయితే దేశ రాజధాని ఢిల్లీలో…
జనం లేక ఈగలు తోలుకుంటున్నారు అన్న సామెతను మనం వింటుంటాం కదా.. ఇప్పుడు ఈ..పెట్రోల్ బంకులో అదే జరుగుతోంది.. కస్టమర్లు లేక వీళ్లు ఇదే పని చేస్తున్నారు.. ఒకళ్లిద్దరు వస్తే అదే మహా భాగ్యమని, దేవుళ్లు వచ్చారని ఫీలవుతున్నారు ఈపెట్రోల్ బంకు నిర్వాహకులు.. పెట్రోల్ ధరల దెబ్బకు ఇక్కడ సీన్ రివర్స్ అయింది.. ఈ ఒక్క బంకే కాదు.. కర్నాటక సరిహద్దు ప్రాంతాలైన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, నియోజకవర్గాల్లోని మెజారిటీ బంకుల పరిస్థితి ఇదే.. తెలంగాణలో…
రోజురోజుకు ఇంధన ధరలు పెరగిపోతుండడంతో వాహనాదారులపై పెనుభారం పడుతోంది. అయితే పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.119.49 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి. అయితే.. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర 18 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.119 కాగా, 17 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.105.02 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో 15 పైసలు తగ్గడంతో…
తీవ్ర సంక్షోభంలో వున్న శ్రీలంకను నిరసనలు చుట్టుముడుతున్నాయి. శ్రీలంక ప్రజలు తీవ్ర అసహనంతో వున్నారు. తీవ్ర ఘర్షణలకు దారితీశాయి పెట్రోలు, డీజల్ ధరల పెంపు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఆందోళనకారులు. రామ్ బుక్కన్న రైల్వే ట్రాక్ పట్టాలు తొలగించారు ఆందోళనకారులు. రామ్ బుక్కన్న పోలీసు స్టేషన్ పై రాళ్ళ దాడికి పాల్పడ్డారు. దీంతో ఆందోళన కారులపై టియర్ గ్యాస్, రబ్బర్ బులెట్లు వర్షం కురిపించారు పోలీసులు. ఈ నిరసనల్లో ఇద్దరు మృతి చెందగా, అనేకమంది గాయాల…
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు.. వివిధ వస్తువల ధరలు, వంటనూనె ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.. అన్నింటి పెరుగుదలపై పెట్రో ధరల ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట… పెట్రో ధరలు పైకి ఎగబాకడంతో.. రవాణా ఛార్జీలు పెరిగి.. దాని ప్రభావం అన్నింటిపై పడుతుందని వెల్లడిస్తున్నారు.. అయితే, ఈ నెలలో ఇంధన వినియోగం బాగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగడమే ఇందుకు కారణంగా విశ్లేషిస్తున్నారు.. మార్చి 2022…
ఒకవైపు కరోనా సంక్షోభం నుంచి ఇంకా బయటపడని సామాన్యులపై ప్రభుత్వాలు ధరల భారం మోపుతూనే వున్నాయి. దీనికి తోడు మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంగా ఉక్రెయిన్ సంక్షోభం వల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా పెట్రో ధరల పెంపు కొనసాగుతూనే వుంది. ఎండలు పెరుగుతున్నట్టే పెట్రో మంల కూడా కొనపాగుతోంది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం గత 13 రోజుల్లో ఇది 11వ సారి. తాజాగా లీటరు పెట్రోలుపై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు…
ఉక్రెయిన్-రష్యా సంక్షోభం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస‍్థలపై ప్రభావం చూపుతోంది. యుద్ధం ప్రారంభమైన రోజునే దీని ప్రభావం ముడి చమురు ఎగుమతులపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంకకు రష్యా వార్… జఠిలసమస్యగా మారింది. రష్యా-ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలపై పడింది. దీంతో శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. శ్రీలంకలోని చమురు సంస్థలు పెట్రోల్‌పై రూ.20, డీజిల్ రూ.15లను ఒక్కసారిగా పెంచేశాయి.…
తెలంగాణ ఆర్టీసీని డీజిల్ కొరత వేధిస్తున్నది. గతంలో ప్రభుత్వం డీజిల్‌పై రూ. 7 రూపాయలు సబ్సీడీ ఇస్తున్నది. డీజిల్‌పై సబ్సిడీ రావడంతో ఆర్టీసీ పెద్ద ఎత్తున డీజిల్‌ను కొనుగోలు చేసింది. అయితే, ఫిబ్రవరి 16 నుంచి ఈ సబ్సిడీని ప్రభుత్వం ఎత్తివేసింది. సబ్సిడీని ఎత్తివేయడంతో తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రైవేట్ బంకులను ఆశ్రయించారు. ప్రైవేట్ పెట్రోల్ బంకుల్లో డీజిల్‌ను ఫిల్ చేయిస్తున్నారు. ఖమ్మం డిపో నుంచి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బంకుల వద్ద క్యూలు…
ఏపీలో ఆర్టీసీకి చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. సాధారణంగా నిత్యం లక్షల లీటర్ల డీజిల్ వినియోగించే ఆర్టీసీకి చమురు కంపెనీలు బయట మార్కెట్ కంటే తక్కువ ధరకు డీజిల్‌ను సరఫరా చేస్తుంటాయి. అయితే 10 రోజులుగా బయట పెట్రోల్ బంకుల్లో విక్రయించే ధర కంటే ఆర్టీసీకి ఇచ్చే డీజిల్ ధర రూ.4.30 వరకు అదనంగా వడ్డిస్తున్నాయి. దీంతో ఆర్టీసీపై రూ.10 కోట్ల భారం పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు బయట పెట్రోల్ బంకుల్లో డీజిల్…