Srisailam: శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో రాత్రి వేళ బేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజపటావిసర్జన, అంకురార్పణ పూజలను దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణకు ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని పల్లకీలో ఊరేగించి ఆలయ ప్రదక్షిణ చేయించి ధ్వజస్తంభం వద్దకు వైభవంగా తీసుకువచ్చారు. అక్కడ వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు, వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. సంక్రాంతి…