ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై సూపర్ సింగ్స్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్(57), ఓపెనర్ డేవాన్ కాన్వే(47) అద్భుతంగా రాణించారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అదిరిపోయే సిక్సర్లు బాదడం విశేషం.