సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యం విషయంలో ఇటీవల సోషల్ మీడియాలో అనేక రూమర్లు, పుకార్లు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. బ్రతికే ఉన్న ఆయన గురించి అసత్య ప్రచారం చేయడంతో కుటుంబ సభ్యులు స్పందించి “ధర్మేంద్రగారు ఆరోగ్యంగా ఉన్నారు, దయచేసి రూమర్లు ప్రచారం చేయొద్దు” అని స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన ధర్మేంద్ర గారు తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ, డాక్టర్ల సూచనల మేరకు మందులు తీసుకుంటున్నారు.…