ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో జాలిరెడ్డి అనే కీలక పాత్ర పోషించిన కన్నడ నటుడు ధనుంజయ్ హీరోగా నటించిన చిత్రం ‘బడవ రాస్కెల్’. గత యేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా కన్నడంలో చక్కని విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగులో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. డాలీ పిక్చర్స్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తెలుగులో పలు సినిమాలను నిర్మించి, చక్కని గుర్తింపు సంపాదించుకున్న రిజ్వాన్…
శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘మహా సముద్రం’.. అను ఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఓ గాఢమైన ప్రేమకథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ కు కూడా అధిక ప్రాధాన్యత ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో ‘గరుడ’ రామ్ కనిపించనున్నారు. తాజాగా ఆయన పోషిస్తున్న ‘ధనుంజయ్’ పాత్రను తెలియజేస్తూ…