ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం త్రయోదశిని ‘ధన త్రయోదశి’ లేదా ‘ధన్‌తేరస్’ అంటారు. దీపావళికి ముందే వచ్చే ధన త్రయోదశి.. సిరి సంపదలకు ప్రత్యేకం. ధన్‌తేరస్ రోజున భారత్‌లో బంగారం కొనడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. సంప్రదాయకంగా ప్రజలు ధన్‌తేరస్‌లో బంగారం, వెండి సహా ఇతర విలువైన పాత్రలను కొనుగోలు చేస్తారు. ఇది సంపద, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. దీపావళి పండగలో భాగంగా ఐదు రోజులు జరుపుకొనే వేడుకల్లో తొలి రోజైన ధన్‌తేరస్..…