డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అర్హులైన వారిలో ఒకరికి తాత్కాలిక ప్రాతిపదికన డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ డీజీ అంజనీకుమార్ లేదా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తాలో ఒకరిని నియమించే అవకాశం ఉంది.