DGCA: ఇటీవలి కాలంలో విమానాల్లో ప్రయాణికుల చెడు ప్రవర్తనకు సంబంధించి అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రయాణికులు తమ సహ ప్రయాణీకులపై మూత్ర విసర్జన చేస్తున్నారు.
గత నెలలో అహ్మదాబాద్లో టెయిల్ స్ట్రైక్ చేసినందుకు ఎయిర్ క్యారియర్ నుండి ఇద్దరు పైలట్లను సస్పెండ్ చేసిన ఒక రోజు తర్వాత, 6 నెలల్లో నమోదైన 4 టెయిల్ స్ట్రైక్స్ కోసం ఇండిగోకు ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ రూ. 30 లక్షల జరిమానా విధించింది.
DGCA కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ క్యారియర్ లకు నిబంధనలు మరింత సులభతరం చేసింది. కొత్త అంతర్జాతీయ గమ్యస్థానాన్ని ప్రారంభించేందుకు భారతీయ క్యారియర్లకు ప్రక్రియను సరళంగా మరియు సౌకర్యవంతంగా చేయడానికి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చెక్లిస్ట్ను కేవలం 10-పాయింట్లకు తగ్గించింది.
భారత దేశంలోనే టీబీ వ్యాక్సిన్ డెవలప్ చేయడానికి పర్మిషన్ కావాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాని భారత్ బయోటెక్ సంస్థ కోరింది. ఇందుకోసం ఫేజ్1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ప్రపోజల్ ను కంపెనీ సబ్మిట్ చేసింది.
Air India: ఎయిర్ ఇండియా విమానంలోకి ఓ పైలెట్ తన స్నేహితురాలిని కాక్పిట్ లోకి తీసుకెళ్లిన ఘటనలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించినందుకు పైలెట్ పై మూడు నెలల సస్పెన్షన్ విధించింది. దీంతో పాటు ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల ఫైన్ విధించింది.
Go First Troubles: వ్యాపారం అన్న తర్వాత ఎన్నో విషయాలు గోప్యంగా ఉంటాయి. వ్యవహారం మంచిగా నడుస్తున్నప్పుడు ఏవీ బయటికి రావు. బిజినెస్ ఎప్పుడైతే బ్యాక్ స్టెప్ వేసిందో.. ఇక ఒకదాని తర్వాత ఒకటి బట్టబయలు అవుతాయి. దీనికి తాజా ఉదాహరణగా గోఫస్ట్ గురించి చెప్పుకోవచ్చు.
Go First: దేశంలో ప్రైవేటు రంగ విమానయాన సంస్థల్లో ఒకటైన గోఫస్ట్ దివాళా తీసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న సంస్థ ఈ రోజు జాతీయ లా ట్రిబ్యునల్ ముందు దివాళా పిటిషన్ దాఖలు చేసింది. 27 దేశీయ గమ్యస్థానాలతో పాటు 7 అంతర్జాతీయ నగరాలకు గో ఫస్ట్ విమాన సేవల్ని అందిస్తోంది. దేశంలో మూడో అతిపెద్ద ఎయిర్ లైనర్ గా ఉంది.
Air India: ఎయిర్ ఇండియా ఇటీవల వరసగా వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో మూత్రవిసర్జన సంఘటన ఆ సంస్థ పరువు తీసింది. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు విమానయాన సంస్థలకు జరిమానా విధించింది. ఇదిలా ఉంటే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి ఓ పైలెట్ తన మహిళా స్నేహితురాలిని కాక్పిట్లోకి తీసుకెళ్లాడు. దీనిపై డీజీసీఏ విచారణ ప్రారంభించింది.