Fire Safety Week: తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నేడు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని వట్టినాగులపల్లిలో ఉన్న అగ్నిమాపక శాఖ శిక్షణా కేంద్రంలో ముఖ్య కార్యక్రమాలు నిర్వహించారు.