ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం మొదటిరోజు ఘనంగా ముగిసింది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు.
కార్తిక మాసం వచ్చిందంటే చాలు అందరి దృష్టి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంవైపే వెళ్తుంది. ఎందుకంటే ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవమే కారణం. వేలసంఖ్యలో భక్తులు వచ్చి కోటిదీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగిస్తారు.. ఇక, కుదరని వాళ్లు ఎన్టీవీ, భక్తి టీవీల్లో లైవ్‌లో వీక్షిస్తుంటారు.. ఈ ఏడాది కోటి దీపోత్సవం ఈ రోజే ప్రారంభమైంది. కోటిదీపోత్సవం-2024 మొదటి రోజు శంఖారావంతో ప్రారంభమైంది.
2012లో లక్షదీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపయజ్ఞం.. 2013లో కోటిదీపోత్సవమై.. పుష్కరకాలంగా భక్తుల మదిలో అఖండజ్యోతిగా వెలుగొందుతోంది. ఈ ఏడాది సైతం రండి.. తరలిరండి అంటూ మరోమారు ఆహ్వానం పలుకుతోంది.
హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ప్రతి సంవత్సరం దీపావళి కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారు. దేశమంతటా ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున ఇళ్లను దీపాలు, దీపాలతో అలంకరిస్తారు. దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీదేవిని పూజిస్తారు కార్తీక మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తేదీన దీపావళి పండుగ జరుపుకుంటారు.
కార్తీక మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల చూపు మొత్తం ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవంపైనే ఉంటుంది.. ఈ ఏడాది కూడా ఘనంగా కోటిదీపోత్సవ యజ్ఞాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది భక్తి టీవీ.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబర్ 9 నుంచి 25 వరకు కోటిదీపోత్సవ మహాయజ్ఞం జరగనుంది.
Dussera 2024: దసరా పండుగ.. విజయదశమి రోజున జమ్మిచెట్టుకు పూజలు చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? శమీ చెట్టుకి విజయదశమికి సంబంధం ఏమిటి?పురాణాలలో జమ్మిచెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది.
హిందూ మతంలో గరుడ పురాణం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గరుడ పురాణంలో జీవిత పరమార్థం దాగి ఉంది. ఇది సనాతన ధర్మంలో మరణానంతరం మోక్షాన్ని అందజేస్తుందని భావిస్తారు. అందుకే సనాతన ధర్మంలో మరణానంతరం గరుడ పురాణం వినాలనే నిబంధన ఉంది.
సనాతన ధర్మంలో పంచామృతం, చరణామృతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆలయ ప్రసాదం తీసుకోవడం ఎంత శుభమో, ఎంత అవసరమో, అదే విధంగా చరణామృతం, పంచామృతాన్ని సేవించడం అంత అవసరమని భావిస్తారు.