ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌ను దేవినేని నెహ్రూ ఎంతో ప్రేమించారని దేవినేని అవినాష్ చెప్పారు. నాన్నకు రాజకీయ జన్మ ఎన్టీఆర్ ఇస్తే.. పునర్జన్మ వైఎస్‌ఆర్ ఇచ్చారన్నారు. తనకు నెహ్రూ రాజకీయ జన్మనిస్తే.. వైఎస్ జగన్ పునర్జన్మ ఇచ్చారని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో వైసీపీ హయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అని, రిటైనింగ్ వాల్ నిర్మించి ప్రజల కల నెరవేర్చడం జరిగిందని అవినాష్ చెప్పుకొచ్చారు. మాజీమంత్రి దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా నెహ్రూఘాట్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న…
మాజీమంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ వద్ద ఆయన తనయుడు, విజయవాడ వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ తలశీల రఘురాం, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్, ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్లు, పలువురు నేతలు దేవినేని నెహ్రూ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మట్లాడుతూ.. దేవినేని నెహ్రూ చనిపోయి ఎనిమిది సంవత్సరాలు అయినా అందరి గుండెల్లో ఆయన బ్రతికే ఉన్నారన్నారు. ఆయన…