Devendra Fadnavis: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ సంచలన విజయం సాధించే దిశగా పరుగెడుతోంది. మొత్తం 288 స్థానాల్లో 220 కన్నా ఎక్కువ చోట్ల లీడింగ్‌లో ఉంది. ఇది మ్యాజిక్ ఫిగర్ 145 కంటే చాలా ఎక్కువ. మరోవైపు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) 53 సీట్లకే పరిమితయ్యేలా కనిపిస్తోంది. మరోసారి మహారాష్ట్రలో బీజేపీ అధికారాన్ని చేపట్టబోతోంది.