విజయదశమి రోజు దేశ వ్యాప్తంగా పండుగ నిర్వహిస్తే, కర్నూలు జిల్లాలోని హుళగుంద మండలంలోని దేవరగట్టు మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్ర ఉత్సవం ఈరోజు జరగనున్నది. ఈ రోజు అర్ధరాత్రి సమయంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక ఉత్సవంలోని మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాలను పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి తరలి వస్తారు. మరోవైపు అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఆ మూర్తుల…