Physical Harassment : జగిత్యాల జిల్లా విద్యా వర్గాల్లో కలకలం రేపుతున్న ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ మండలంలో ఉన్న ఓ ప్రభుత్వ హైస్కూల్ ప్రధానోపాధ్యాయునిపై విద్యార్థినులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అతను విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడని, కులాలను అడిగి అవమానిస్తూ టచ్ చేస్తున్నాడని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కలెక్టరేట్‌కు వెళ్లి జిల్లా విద్యాధికారి (డీఈవో) రాముకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు తమ సమస్యను వెల్లగక్కుతూ ప్రధానోపాధ్యాయుడు మానసికంగా…