ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో బ్రెయిన్ ట్యూమర్ కూడా ఓ కారణం. మెదడులోని కణాలు నియంత్రించలేని విధంగా పెరిగినప్పుడే ఇది వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా న్యూరో సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ , డిమెన్షియా, అల్జీమర్స్, బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మెదడు మన మొత్తం శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం.
High blood pressure causes dementia: అధిక రక్తపోటు(హై బీపీ) శరీరంలో సైలెంట్ కిల్లర్. సైలెంట్ గా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. గుండె, మెదడు కిడ్నీలు, రక్తనాళాలు ఇలా ప్రతీ అవయవంపై అధిక రక్తపోటు ప్రభావం పడుతుంది. తాజాగా హైబీపీ మతిమరపు(డిమెన్షియా)కారణం అవుతుందని తేలింది. ఆస్ట్రేలియాకు చెందిన ‘ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబర్ హెల్త్’ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధిక రక్తపోటు అదుపులో లేకపోతే మెదడులోని కొన్ని భాగాల్లో సూక్ష్మ…