ఈ రోజు విడుదలైన దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే మరోసారి ఆధిక్యత కనబరుస్తోంది. ఢిల్లీని బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ ఎంపీ అభ్యర్థి కీలక వ్యాఖ్యలు చేశారు.
గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన వేడితో అల్లాడిపోతుంది. ఇప్పటికే 52 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకోవైపు నీటి సమస్యతో బాధపడుతోంది. మరికొన్ని రోజులు హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని కేంద్ర వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం అయింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో భారత కూటమి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కూటమిలో ఉన్న పార్టీ అధినేతలు, నాయకులు పాల్గొన్నారు.
దేశ వ్యాప్తంగా తీవ్ర ఎండలు, వడగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 2024 మార్చి 1 నుండి హీట్ స్ట్రోక్‌ల కారణంగా 56 మంది చనిపోయారు. నేషనల్ క్లైమాటిక్ డేటా ప్రకారం.. ఢిల్లీతో సహా అనేక ప్రదేశాలలో మధ్య, తూర్పు మరియు ఉత్తర భారతదేశంలో తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రంలో.. ఒక్క మే నెలలోనే 46 మంది మరణించారు. వాయువ్య, మధ్య మరియు తూర్పు భారతదేశంలో ప్రస్తుతం ఉన్న వేడి తరంగాల పరిస్థితులు రాబోయే 2…
ఢిల్లీలోని కశ్మీర్ గేట్ మెట్రో పోలీస్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం గురించి ఢిల్లీ అగ్నిమాపక శాఖకు అర్ధరాత్రి 12:45 గంటలకు పోలీసులు సమాచారం అందించారు. కాగా.. మంటలను అదుపు చేసేందుకు కనీసం 12 అగ్నిమాపక దళ వాహనాలను ఘటనాస్థలికి తరలించారు.
భారతదేశంలోని అనేక రాష్ట్రాలు తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వడదెబ్బ కారణంగా డజన్ల కొద్దీ మరణించారు. తాజాగా.. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రాల్లో మోహరించిన దాదాపు 20 మంది ఎన్నికల సిబ్బంది హీట్‌స్ట్రోక్‌కు గురయ్యారు. మే నెలలో ఉష్ణోగ్రత రికార్డులను బద్దలు కొట్టిన ఢిల్లీ.. బుధవారం 79 సంవత్సరాల గరిష్ట స్థాయి 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఢిల్లీలో ఎండలతో పాటు తీవ్రమైన వేడిగాలులు అక్కడి ప్రజానీకాన్ని బెంబెలెత్తిస్తున్నాయి. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఎండలు బీభత్సం సృష్టి్స్తున్నాయి. తాజాగా.. మొన్నటికి మొన్న ఢిల్లీలోని ముంగేష్ పురిలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. ఈ క్రమంలో.. జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జనాలతో పాటు జంతువులు, పక్షులు ఎండలకు అలమటిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టు ఆవరణలో నివసించే జంతువులు, పక్షులకు తగిన ఆహారం, నీటి సరఫరా తప్పనిసరిగా ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)…
భారతదేశంలో ఎండలు దడపుట్టిస్తున్నాయి. 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో.. ఢిల్లీతో సహా పలు చోట్ల మధ్య, తూర్పు మరియు ఉత్తర భారతదేశంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో.. 54 మంది మృతి చెందారు. మే 31 నుంచి జూన్ 1 వరకు ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అంచనా వేశారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. మే 31 నుంచి జూన్ 2…
దేశ రాజధాని ఢిల్లీలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. గత కొద్ది రోజులుగా మంచినీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కనీస అవసరాలు తీరక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు తీవ్రమైన ఎండలు.. ఇంకోవైపు నీటి ఎద్దడి..
Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. భర్తను కలుసుకునేందుకు వెళ్తున్న మహిళపై ఈ-రిక్షా డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెకు మత్తుమందు ఇచ్చి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. నిందితుడు మహమ్మద్ ఉమర్(24)ని ఉత్తర ఢిల్లీలోని కోట్వాలీ ఏరియా నుంచి అరెస్ట్ చేశారు.