ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా ఏపీకి చెందిన క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి నియమితులయ్యారు. ఈమేరకు ఢిల్లీ ఉన్నత విద్యాశాఖ సంచాలకులు అజ్మిల్ హఖ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన కరణం మల్లీశ్వరి… 2000 సంవత్సరంలో భారత్ తరుపున ఒలింపిక్స్‌లో పాల్గొని కాంస్య పతకం సాధించారు. 1999 కేంద్రం.. పద్మశ్రీ పురస్కారంతో మల్లీశ్వరిని సత్కరించింది.
తెలుగు తేజం, ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లేశ్వరికి ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమించింది ప్రభుత్వం.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని ఢిల్లీలో తొలిసారి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర సర్కార్… ఆ వర్సిటీ తొలి వీసీగా కరణం మల్లేశ్వరికి అవకాశం దక్కింది.. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్‌గా ఏపీకి చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది…