Delhi Budget 2024: ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి సోమవారం (మార్చి 4) కేజ్రీవాల్ ప్రభుత్వ 10వ బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్‌లో విద్యకు రూ.16,396 కోట్లు కేటాయించారు.
అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని పదవి రేసులో లేరని ఢిల్లీ మంత్రి అతిషి బుధవారం అన్నారు. కేజ్రీవాల్ దేశానికి ఆదర్శప్రాయమైన ప్రధాని కాగలరని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ చేసిన వ్యాఖ్యలపై అతిషి స్పందిస్తూ .. ఇది ప్రధాన ప్రతినిధి వ్యక్తిగత అభిప్రాయం కావచ్చని.. కానీ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని రేసులో లేరన్నారు.