మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీలోని జసోలా మెట్రో స్టేషన్‌లో ఏప్రిల్ 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హవాలా మార్గాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను మళ్లిస్తున్న వ్యక్తిని ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, అల్-బదర్‌లకు డబ్బును మళ్లించినట్లు ఢిల్లీ ప్రత్యేక కమిషనర్ హెచ్‌జిఎస్ ధాలివాల్ వెల్లడించారు.