Liquor Scam: నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. విచారణపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కవిత ఈడీ అధికారుల ముందు హాజరవుతారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వారితో కలిపి కవితను ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఇద్దరు లేదా ముగ్గురిని ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది.
Also Read:Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణలోనూ 3 రోజులు మద్యం షాపులు బంద్
మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా ఇప్పటికే 11 మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై.. ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా కవితను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు రెడీ అయ్యారు. పిళ్లై విచారణలో భాగంగా ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఈడీ కవితకు నోటీసులు జారీ చేసింది. కవితతో పాటుగా పిళ్లైను కలిపి విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, పిళ్లై తాను ఇచ్చిన స్టేట్ మెంట్ వెనక్కు తీసుకుంటున్నట్లు కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. కవిత విచారణకు హాజరు అవ్వటానికి ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం కీలకంగా మారుతోంది.
Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
Also Read:CM KCR : తెలంగాణ ప్రగతిని బీజేపీ ఓరుస్తలేదు
కవితకు ఈడీ నోటీసులపై స్పందించిన సీఎం కేసీఆర్… కవితను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని అన్నారు. విచారణ పేరుతో కవితను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టొచ్చు అని బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వ్యాఖ్యానించడంతో సర్వత్ర చర్చనీయాంశమైంది. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సైతం ఢిల్లీకి వెళ్లారు. పార్టీ విస్తృత స్థాయి మీటింగ్ ముగియగానే కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
తాజావార్తలు
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్టెల్లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్ను దాటగలదా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..