Delhi In Danger: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యపు విషం మితిమీరిపోతుంది. అయితే, వాతావరణ కాలుష్యమే కాకుండా నీరు కూడా విషతుల్యంగా మారుతోంది. ఓ వైపు ఢిల్లీ గాలి కలుషితమై ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతుంటే., మరోవైపు యమునా నదిలో పెద్ద ఎత్తున నురగలు రావడం మొదలైంది. ఓ నివేదిక ప్రకారం.. నదిలో మురుగు నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. దీని కారణంగా పండుగ సమయంలో పూజించే వారికి ఇది ప్రమాదకరం. ఇదివరకు వర్షాలు బాగా కురవడంతో…