మంచు విష్ణుకి వ్యతిరేకంగా యూట్యూబ్ చానెళ్లలో ఉన్న వీడియోలు, కంటెంట్‌ను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తి ప్రతిష్ట దిగజార్చేలా ఉన్న కంటెంట్‌ను వెంటనే తొలిగించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఆయన స్వరం, ఆయన పేరు, ఆయన తీసిన సినిమాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించారు. ఈ మేరకు పది యూట్యూబ్ లింక్‌లకు హైకోర్టు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఈ తీర్పు సోషల్ మీడియాలో నటులు, వారి కుటుంబాల పై అవమానకరమైన సమాచారాన్ని అరికట్టేందుకు…