ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఓటర్ ప్రత్యేక సర్వేపై కాంగ్రెస్ ఆందోళనలు చేపడుతోంది. అటు పార్లమెంట్‌లోనూ.. ఇటు పబ్లిక్‌గానూ రాహుల్‌గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీకి ఢిల్లీ న్యాయస్థానంలో చుక్కెదురైంది.