ఢిల్లీ బాంబ్ పేలుడు యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. ప్రశాంతంగా ఉన్న దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు బ్లాస్ట్ అయింది. పెద్ద ఎత్తున విస్ఫోటనం జరగడంతో ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక ప్రజలు అయోమయానికి గురయ్యారు.