ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్‌లోని దుకాణాలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భగీరథ్ ప్యాలెస్‌లో అగ్నిమాపక సిబ్బంది వరుసగా మూడో రోజు శనివారం కూడా మంటలను ఆర్పేందుకు శ్రమిస్తుండగా.. భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 200 దుకాణాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.