ముద్దుగా బొద్దుగా మురిపిస్తూ తెలుగువారిని భలేగా ఆకట్టుకుంటోంది ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా. తెలుగు సినిమాలతోనే ఓ వెలుగు చూసిందీ ముద్దుగుమ్మ. కేవలం నటనతోనే కాకుండా తన గళంతోనూ ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. ఆరంభంలో బరువు దరువుతో అలరించిన రాశీ ఖన్నా, ఇప్పుడు నాజూకు సోకులు సొంతం చేసుకొని మరింతగా ఆకర్షిస్తోంది. దక్షిణాది చిత్రాలతోనే ఈ ఉత్తరాది అందం మెరిసిపోవడం విశేషం! రాశీ ఖన్నా 1990 నవంబర్ 30న ఢిల్లీలో జన్మించింది. అక్కడే లేడీస్ శ్రీరామ్ కాలేజ్…