AP Crime: టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అమాయకులను మోసం చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది.. తాజాగా, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఫోటోను తమ వాట్సాప్ డీపీగా పెట్టుకుని.. తాము ఎన్.ఆర్.ఐ.లమని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేసింది సీఐడీ.. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న సాయి శ్రీనాథ్ (గచ్చిబౌలి, హైదరాబాద్), సుమంత్ (పఠాన్ చెరువు) లను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.…