న్యూజిలాండ్ మహిళలతో వన్డే సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 40.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. ఎడమచేతి వాటం స్పిన్నర్ రాధ యాదవ్ (3/35), అరంగేట్ర పేసర్ సైమా ఠాకోర్ (2/26) సత్తాచాటారు. దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండో వన్డే అహ్మదాబాద్‌లోనే ఆదివారం జరుగుతుంది.…
Womens T20 World cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. తొలిసారి ఈ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు భారత మహిళల జట్టు పూర్తిగా సిద్ధమైంది. ఈసారి టి20 ప్రపంచ కప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో జరగనుంది. టోర్నీలో ఏ ఆటగాళ్లు పాల్గొంటారనేది ఇప్పటికే ప్రకటించారు కూడా. అయితే, మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. పూనమ్…
Team India: సెమీ ఫైనల్లో గెలిచి ఫైనల్ కు చేరి ప్రపంచకప్ చేజిక్కించుకోవాలన్న టీం ఇండియా ఆశలకు ఆస్ట్రేలియా జట్టు గండికొట్టింది. సెమీఫైనల్‌లో ఓటమి తర్వాత భారత మహిళా క్రీడాకారిణి దీప్తి శర్మకు భారీ బాధ్యత మీద పడింది.
WPL Auction 2023: మహిళల ప్రీమియర్ లీగ్-2023 వేలం ముంబైలో జరిగింది. ఈ వేలంలో మొత్తం 87 మంది క్రికెటర్లను ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఈ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను అదృష్టం వరించింది. ఆమెను 3.4 కోట్ల భారీ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా మంధాన నిలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్‌ను 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్ సొంతం…