రెండు తెలుగు రాష్ట్రాలకు వర్షాలు ముంచెత్తడంతో.. వరదలతో రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. జనజీవనం స్తంబించింది. దీంతో ప్రజలు నిలవనీడలేకుండా రోడ్డునపడ్డారు. ఇక భద్రాచలంలో గోదారి ఉగ్రరూపం దాల్చింది. వరద నీటితో భద్రాద్రి ఆలయ పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా మరో ప్రమాద హెచ్చరికలు జారీ చేసారు. అయితే రెండు రోజుల నుంచి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు తగ్గుతూ వస్తుంది. రెండు వారాల నుండి ఎగువ నుంచి వచ్చిన భారీ వరదల వల్ల…