భారత్‌లో కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది. మంకీపాక్స్ క్లాడ్ 1బి మొదటి కేసు నమోదైంది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు సోమవారం ధృవీకరించాయి. గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన మంకీపాక్స్ జాతి అని అధికారులు తెలిపారు. ఈ Mpox క్లాడ్ 1B వేరియంట్ కేసు కేరళకు చెందిన ఒక వ్యక్తిలో కనుగొన్నారు.
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉన్న కిష్త్వార్ జిల్లాకు చెందిన 23 మంది ఉగ్రవాదులను పరారీలో ఉన్న నేరస్థులుగా ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ కోర్టు. అందుకు సంబంధించి పోలీసులు సమాచారం ఇచ్చారు. దోడాలోని ప్రత్యేక UAPA (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం) కోర్టు ఈ ఉగ్రవాదులపై నమోదైన కేసులకు సంబంధించి తమ ముందు హాజరు కావడానికి ఒక నెల సమయం ఇచ్చిందని, లేకపోతే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని అధికారులు తెలిపారు.