మరో రెండు రోజుల్లో నవంబర్ నెల ముగియనుంది. అనంతరం ఈ ఏడాదిలోనే చివరి నెల డిసెంబర్ ప్రారంభం కానుంది. సాధారణంగా ప్రతినెల 1వ తేదీన కొన్ని మార్పులు జరుగుతుంటాయి. డిసెంబర్‌లో కూడా కొన్ని రూల్స్ మారబోతున్నాయి. ఇవి ప్రజల జీవనంపై ప్రభావం చూపనున్నాయి. పెన్షన్ పొందేవారు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి దేశవ్యాప్తంగా పెన్షనర్లకు ముఖ్యమైన వార్త. పెన్షన్ పొందడానికి 30 నవంబర్ 2022లోపు మీ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఒకవేళ ఈనెలాఖరులోగా సర్టిఫికెట్ సమర్పించకపోతే డిసెంబర్ 1…
ఇప్పటికే పెట్రోల్ ధరలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో డీటీహెచ్ వినియోగదారులపైనా భారం పడనుంది. డిసెంబర్ 1 నుంచి డీటీహెచ్ ఛార్జీలు పెరగనున్నాయి. జీ, స్టార్, సోనీ, వయాకామ్ 18 వంటి పలు సంస్థలు కొన్ని పాపులర్ టీవీ ఛానళ్లను డిసెంబర్ 1 నుంచి తమ బొక్వెట్ నుంచి తొలగించనున్నాయి. దీంతో ఆయా ఛానళ్లను వీక్షించాలంటే అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. బొక్వెట్‌లో అందించే ఛానళ్ల ఛార్జీలు సగటున నెలకు రూ.15…