ఇటీవల యువ భారత్ అండర్-19 ప్రపంచకప్ గెలవడంలో కెప్టెన్ యశ్ ధుల్ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం అతడు రంజీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ మేరకు ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే యశ్ ధుల్ సెంచరీతో కదం తొక్కడం విశేషం. గౌహతి వేదికగా తమిళనాడుతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగి యశ్ ధుల్ సెంచరీతో రాణించాడు. మొత్తం 150 బంతులు ఆడి 113 పరుగులు చేశాడు. అతడి…