Global Capability Centres: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్.. విశ్వ నగరంగా ఎదుగుతోందనటానికి మరో చక్కని ఉదాహరణ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు. ఈ సెంటర్లకు భాగ్య నగరం కేంద్రంగా మారుతోంది. ఈ మేరకు పలు బహుళజాతి సంస్థలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్ల కోసం కంపెనీలు ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల నిర్వహణను ఎంతో కీలకంగా భావిస్తున్నాయి.