వైద్యాన్ని వ్యాపారంగా చేసుకుని డబ్బులు దండుకుంటున్నారు కొందరు డాక్టర్లు.. ఆసుపత్రిలో చేరే పేషెంట్ల ఆర్ధిక స్థితిని బట్టి.. వాళ్ల అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకొని డబ్బులు లాగేస్తున్న ఘటనలు నిత్యం ఏదో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఠాగూర్ సినిమాలో ప్రాణం పోయిన వ్యక్తికి ట్రీట్‌మెంట్ చేస్తున్నట్లుగా మేనేజ్ చేసి పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేసే సీన్ అందరికి గుర్తుండిపోతుంది.