జమ్ముకాశ్మీర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. షోపియాన్ జిల్లాలో బీహార్ కు చెందిన ముగ్గురు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపేశారు. ఈ ఘటన గగ్రాన్ అనే ప్రాతంలో జరిగింది. దీనిపై సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు, ఆర్మీ అధికారులు చుట్టుముట్టాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని అన్మోల్ కుమార్, పింటూ కుమార్ ఠాకూర్, హీరాలాల్ యాదవ్ గా పోలీసులు తెలిపారు.