టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక మలుపు.. డీఈ రమేష్ 80 మందికి ఏఈ పేపర్ అమ్మినట్లు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. పూల సురేష్ నుంచి ఏఈ పేపర్ తీసుకొచ్చిన డీఈ రమేష్.. పెద్దపల్లి, కరీంనగ్ జిల్లాల్లో అభ్యర్థులకు పేపర్ విక్రయం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
TSPSC: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీక్ కేసు దేశంలోనే సంచలనం సృష్టించింది. ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. లీకేజీకి పాల్పడిన వారు వ్యవస్థను మోసం చేయడానికి ChatGPTని ఉపయోగించారు.