కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న చిన్నారులకు భారత్ బయోటెక్ శుభవార్త వినిపించింది. 12నుంచి18 సంవత్సరాల వయసున్న పిల్లలకు భారత్ బయోటెక్ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కరోనా మహమ్మారి నుంచి పిల్లల్ని రక్షించేందుకు మార్గం సుగమం కానుంది. దేశంలో 18 సంవత్సరాల లోపువారికి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ల సరఫరా జరుగుతోంది. చిన్నారుల వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఎప్పుడో పూర్తయ్యాయి. డీసీజీఐ అనుమతి వచ్చిన వెంటనే చిన్నారులకు వ్యాక్సిన్ కార్యక్రమం…